ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దేశాభివృద్ధిలో వాజ్‌పేయి పాత్ర చిరస్మరణీయం

ABN, First Publish Date - 2021-12-26T05:25:16+05:30

దేశాన్ని అన్నిరంగాల్లో ముందుంజలో నిలిపేందుకు జరిగిన కృషిలో అటల్‌బీహారీ వాజ్‌పేయి కృషి ఉందని బీజేపీ నాయకులు అన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి 

పిఠాపురం, డిసెంబరు 25: దేశాన్ని అన్నిరంగాల్లో ముందుంజలో నిలిపేందుకు జరిగిన కృషిలో అటల్‌బీహారీ వాజ్‌పేయి కృషి ఉందని బీజేపీ నాయకులు అన్నా రు.  పిఠాపురం కచేరి సెంటర్‌లో శనివారం వాజ్‌పేయి చిత్రపటానికి  పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, పట్టణ అధ్య క్షుడు పసుపులేటి సత్యనారాయణ, నాయకులు బుర్రి మురళీధరరావు, గండి కొండలరావు, ఏడుకొండలు, దోనే అచ్యుతరామయ్య,  సూరిబాబు, తాతీలు  పాల్గొన్నారు.

గొల్లప్రోలు: గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు, ఉలవశెట్టి శ్రీను, మలిరెడ్డి నారాయణరావు, వియ్యపు రాములు తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం: బీజేపీ రాష్ట్ర నాయకులు బిక్కిన విశ్వేశ్వరరావు, యార్లగడ్డ రామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. 

గోకవరం: స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన వాజ్‌పేయి జన్మదిన వేడుకల్లో బీజేపీ నా యకులు పాల్గొని వాజ్‌పేయికి నివాళులర్పించి అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరాసు శివప్రసాద్‌, మట్టా మంగరాజు, కోన సురేష్‌ పాల్గొన్నారు.

సర్పవరం జంక్షన్‌ : దేశ రక్షణ, దేశాభివృద్ధికి మాజీ ప్రధాని అటల్‌ బిహరీ వాజ్‌పేయి చేసిన సేవలు మరువలేమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు అన్నారు. 49వ డివిజన్‌లో గుడ్‌ గవర్నెన్స్‌ దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి 97వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. కిసాన్‌ మోర్చా జి ల్లా అధ్యక్షుడు మామిడాల శ్రీనివాసరావు, ధార్మిక సెల్‌ కన్వీనర్‌ కవికొండల భీమశేఖర్‌, కేతినీడి విజయరామయ్య తదితరులు పాల్గొన్నారు. 

నడకుదురు(కరప): నడకుదురు గ్రామంలో శనివారం మాజీ ప్రధాని వాజ్‌పేయి 97వ జయంతి వేడుకను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డి రమణేశ్వర్‌, నాయకులు పుట్టా వీరప్రసాద్‌గాంధీ, ముమ్మిడి పెదకాపు, చంటిబాబు, మట్టా వెంకటనారాయణ, తుమ్మలపల్లి గోవిందు, వి.చలపతిరావు, వి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

ఏలేశ్వరం: మాజీ ప్రఽధాని వాజ్‌పేయి జయంతిని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గట్టెం వెంకటరమణ ఆధ్వర్యం లో నిర్వహించారు. పార్టీ జిల్లా పూర్వ కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు, రెడ్డి లోవరాజు, గట్టెం సీతారాం, గంగాధర్‌, కృష్ణ, చిన్న, ప్రసాద్‌, బాబీలతో కలిసి వెంకటరమణ పట్టణంలోని బాలాజీచౌక్‌ సెంటర్లో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 



Updated Date - 2021-12-26T05:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising