నూతనంగా నిర్మించిన గృహాలకు మెట్లు తొలగింపు
ABN, First Publish Date - 2021-02-15T23:54:04+05:30
నూతనంగా నిర్మించిన గృహాలకు మెట్లు తొలగింపు
గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం ఇస్సాపాలెం గ్రామ శివారులో శిశుమందిర్ సమీపంలో నూతనంగా నిర్మించిన గృహాలకు మెట్లు అధికారుల తొలగించారు.గోగులపాడు గ్రామంలో పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేశామని ఎమ్మెల్యే కక్ష సాధిస్తున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను టీడీపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరమర్షించారు. అన్ని అనుమతులతో గృహాలు నిర్మించుకుంటే మెట్లు కూల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించమని హెచ్చరించారు.
Updated Date - 2021-02-15T23:54:04+05:30 IST