ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు

ABN, First Publish Date - 2021-06-21T05:50:18+05:30

అధికారంలోకి రాగానే 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌... రెండేళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు కేవలం 10వేల ఉద్యోగాలతో ప్రకటన చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు.

జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు

గుంటూరు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రాగానే 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌... రెండేళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు కేవలం 10వేల ఉద్యోగాలతో ప్రకటన చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఆదివారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.  ఒక్క పోలీసు శాఖలోనే 7వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 470 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం వింతగా ఉందన్నారు. 25వేల డీఎస్సీ టీచర్ల పోస్టులు ఉంటే వాటి గురించి అసలు క్యాలెండర్‌లో ప్రస్తావించలేదని ఆరోపించారు.    ఇచ్చామని చెబుతున్న ఆరు లక్షల ఉద్యోగాలలో మూడులక్షలు వలంటరీ పోస్టులేనన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఉన్న ఉద్యోగాలను కూడా జగన్‌ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పడం సిగ్గుమాలిన చర్య అని జీవీ ఆంజనేయులు అన్నారు. 


Updated Date - 2021-06-21T05:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising