ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగం డెయిరీపై మరో ఎత్తుగడ

ABN, First Publish Date - 2021-08-20T05:40:00+05:30

సంగం డెయిరీపై రాష్ట్ర ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్‌ ట్రస్టు పత్రాలు ఇవ్వాలని లేఖ

దేవదాయ శాఖ జేసీ పేరుతో మాజీ ఎమ్మెల్యే నరేంద్రకి నోటీసు

వివరాల సమర్పణకు 10 రోజుల గడువు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీపై రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసింది. ఆ డెయిరీని ఎలాగైనా సరే ఇబ్బందులకు గురి చేసేందుకు గత కొన్ని నెలల నుంచి చేయని ప్రయత్నం అంటూ లేదు. తొలుత డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి నరకయాతనకు గురి చేసింది. ఆ తర్వాత డెయిరీకి తెనాలి సబ్‌ కలెక్టర్‌ని ఇన్‌చార్జిగా నియమించి తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే హైకోర్టు బ్రేక్‌ వేయడంతో ఇప్పుడు శ్రీధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్టుపై కన్నేసింది. పాడి రైతుల డబ్బులతో భూమిని  కొనుగోలు చేసి అందులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించి ప్రజలకు వైద్యం అందిస్తోన్నది. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఇక్కడ వైద్య చికిత్సలు లభించాయి. అయినప్పటికీ రాజకీయ కక్షతో ప్రభుత్వం ఏదో ఒక చర్యకు ఉపక్రమిస్తూనే ఉన్నది. తాజాగా దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌, శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి దేవస్థానం విజయవాడ ఈవో డీ భ్రమరాంబ పేరుతో మేనేజింగ్‌ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కి నోటీసు జారీ చేశారు. ఆ నోటీసుని కనీసం చేతికి కూడా అందజేయకుండా సిబ్బంది వచ్చి అక్కడి ఆస్పత్రి గోడపై అతికించి వెళ్లిపోయారు. 


లేఖ సారాంశమిలా..

నోటీసులో సారంశం ఇలా ఉంది. దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబ అయిన నన్ను.. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్‌ ట్రస్టుకు సంబంధించి సమాచారం సేకరించాల్సిందిగా ప్రభుత్వం నియమించింది. ట్రస్టు స్వభావం, వార్షికాదాయం తదితర వివరాలు సేకరించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ మత సంస్థలు, దేవదాయ చట్టం 1987 ప్రకారం ఈ చర్యలు చేపట్టాలని కోరింది. ఈ నేపథ్యంలో ట్రస్టు డీడ్‌, మేనేజింగ్‌ ట్రస్టీ, ఇతర ట్రస్టీల నియామకాలకు సంబంధించిన పత్రాలు, ట్రస్టు ఆస్తి, స్వాధీనంలో ఉన్న భూమి వివరాల కాపీలు, ఎఫ్‌డీఆర్‌లు, ట్రస్టు ఎస్టాబ్లిష్‌మెంట్‌ వివరాలు, గత మూడేళ్లలో 2018-19, 2019-20, 2020-21 ఆదాయం, ఖర్చులు, ఆదాయపు పన్ను మినహాయింపు సర్టిఫికేట్లను 10 రోజుల వ్యవధిలో తనకు నివేదించాలి. అని ఆ లేఖలో జాయింట్‌ కమిషనర్‌ కోరారు. 


Updated Date - 2021-08-20T05:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising