ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరగబడే రోజులొచ్చాయి..!

ABN, First Publish Date - 2021-07-13T04:48:31+05:30

వైసీపీ పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరని.. ఇచ్చిన హామీలు మరుస్తున్న వైసీపీ నేతలపై తిరగబడే రోజులు వచ్చాయని టీడీపీ గుంటూరు పార్లమెంటు కమిటీ నేతలు పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పన్నుపోటుపై ఉద్యమబాట

టీడీపీ గుంటూరు పార్లమెంటు నేతలు

గుంటూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరని.. ఇచ్చిన హామీలు మరుస్తున్న వైసీపీ నేతలపై తిరగబడే రోజులు వచ్చాయని టీడీపీ గుంటూరు పార్లమెంటు కమిటీ నేతలు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో  కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ నేతృత్వంలో సోమవారం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రులు డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, కోవెలమూడి రవీంద్రలు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామ కమిటీలతోపాటు, గుంటూరు పార్లమెంట్‌అనుబంధ కమిటీలను వెంటనే పూర్తిచేయాలని సూచించారు. ప్రజలు కొవిడ్‌ బాధల్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం పన్నులు పెంచుకుంటూ పోతోందని, వీటిపైప్రజాక్షేత్రంలో ఉద్యమాలకు దిగుదామన్నారు. చెత్తపన్ను, నీటిపన్ను, ఆస్తిపన్ను పెంపుపై ఒక నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించి డిజ్లనవారీగా ప్రజలల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం విడుదలచేసిన జాబ్‌ క్యాలెండర్‌పై యువత, విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిజేయాలన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై జిల్లా కేంద్రంలో ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేస్తే ఆ ప్రభావం జిల్లా అంతటా ఉంటుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. ప్రధానంగా జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ళస్థలాలు ఇచ్చి ఇళ్లుకూడా కట్టిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మీరే కట్టుకోమనడం దారుణమని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సీనియర్‌ నేత నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో పన్నువిధానంపై అన్ని విపక్షాలను కలుపుకొని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటోందని, వారి నగదు పంపిణీ కార్యక్రమాల వల్ల ఒక్క పేదవాడి జీవన ప్రమాణమైనా పెరిగిందా అని  ఆలపాటి ప్రశ్నించారు. దానికి తోడు అర్హులను పథకాలకు దూరంచేస్తున్నారని మండిపడ్డారు.  కరోనా కష్టకాలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాకినేని  అన్నారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలపై ఇక పోరాటం తప్పదని గుంటూరు పశ్చిమ ఇన్‌చార్జ్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ నేతలు పిల్లి మాణిక్యరావు, గంజి చిరంజీవి, మానుకొండ శివప్రసాద్‌, ఎల్లావుల ఆశోక్‌యాదవ్‌, గుంటూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు అడకా శ్రీనివాసరావులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, తీర్మానాలను కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య ప్రవేశపెట్టారు. సమావేశంలో నేతలు చిట్టాబత్తిని చిట్టిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, పోతినేని శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్‌, కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, ఎన్‌.బాలాజీ, మానం పద్మశ్రీ, ఈరంటి వరప్రసాద్‌, నేతలు యోగేశ్వరరావు, దామినేని శ్రీనివాసరావు, దామచర్ల శ్రీనివాసరావు, మేళం సైదయ్య, ఎస్‌ఎస్‌పీ జాదా, తాడివాక సుబ్బారావు, ఘంటసాల సోమశేఖర్‌, తలతోటి సురేంద్ర, కల్లూరి శ్రీనివాసరావు, పోపూరి నరేంద్ర, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T04:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising