ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు
ABN, First Publish Date - 2021-09-30T00:25:22+05:30
ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధిహామీ పనులపై విజిలెన్స్ విచారణ జరగడం లేదని
అమరావతి: ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధిహామీ పనులపై విజిలెన్స్ విచారణ జరగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను అఫిడవిట్ రూపంలో హైకోర్టులో కేంద్రం దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను హైకోర్టు రికార్డు చేసింది. సీఎస్ ఆదిత్యనాథ్ కూడా విజిలెన్స్ విచారణ జరగడం లేదని చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. విజిలెన్స్ విచారణ కారణంగా బిల్లుల చెల్లింపు నిలిపివేశామన్న.. ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. రెండు లక్షల 70 వేల పనుల్లో 4 వేల పనులపై మాత్రమే విచారణ జరుగుతుందని, ప్రభుత్వం పేర్కొనడాన్ని హైకోర్టు అంగీకరించింది. బిల్లులు చెల్లింపునకు సంబంధించి వడ్డీతో కలిపి ఇవ్వాలా, ఏ నిధుల నుంచి ఈ బిల్లులు చెల్లించాలనే అంశంపై హైకోర్టులో వాదనలు వినేందుకు వచ్చే నెల 4కు కేసు విచారణ వాయిదా పడింది. 700 పిటిషన్లపై వచ్చేనెల 8న తీర్పు ఇస్తామని హైకోర్టు ప్రకటించింది. పిటిషనర్ల తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదించారు.
Updated Date - 2021-09-30T00:25:22+05:30 IST