కరోనా వేళ... ఎన్నెన్ని కష్టాలో!
ABN, First Publish Date - 2021-05-28T08:44:34+05:30
కరోనా మహమ్మారి నుంచి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు వైరస్ బాధితులు ఏ మేర ప్రయాస పడుతున్నారో చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ దృశ్యం
విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే 27: కరోనా మహమ్మారి నుంచి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు వైరస్ బాధితులు ఏ మేర ప్రయాస పడుతున్నారో చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ దృశ్యం. విజయనగరం సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా బారినపడ్డాక హోం ఐసోలేషన్‌లో వైద్యం పొందుతున్నాడు. ఇంటి వద్దే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసుకున్నాడు. వారం దాటినా పరిస్థితి కుదుటపడక పోవడంతో ఇతర పరీక్షల కోసం కుటుంబ సభ్యుల సాయంతో విజయనగరంలోని గురజాడ విగ్రహం సమీపంలోని ఓ ల్యాబ్‌కు గురువారం ఇలా ఆటోలో సిలిండర్‌తో అవస్థలు పడుతూనే వచ్చాడు.
Updated Date - 2021-05-28T08:44:34+05:30 IST