ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూక్ష్మ పరిశీలకుల నివేదికలను జాగ్రత్తగా పరిశీలించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-02-06T05:22:39+05:30

ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోలింగ్‌ నిర్వహణ పూర్తి అనంతరం సూక్ష్మ పరిశీలకుల నివేదికలను జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సహాయపరిశీలకులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ సి.హరికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 5: ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోలింగ్‌ నిర్వహణ పూర్తి అనంతరం సూక్ష్మ పరిశీలకుల నివేదికలను జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సహాయపరిశీలకులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సభాభవనంలో తన ఛాంబరులో గ్రామ పంచా యతీ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల పరిశీలకులు, సహాయకులుగా కేటాయించిన 14 మందితో కలెక్టర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రాధాన్యత, పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారి రంజిత్‌ బాషను నియమించచడం జరిగిందన్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో జరుగు  గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో 14 మండలాల్లో, రెండవ విడత 11 మండలాల్లో, మూడవ విడత 12 మండలాల్లో, నాలుగో విడత 13 మండలల్లోని గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు ఒక్కో మండలానికి ఎన్నికల సహాయ పరిశీలకులను నియమించామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ (రెవెన్యూ) గౌతమి, సీపీఓ తిప్పేస్వామి, సహాయ పరిశీలకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-06T05:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising