ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లికోడుతో దెబ్బతిన్న వరి పంట

ABN, First Publish Date - 2021-10-31T05:59:31+05:30

ఖరీఫ్‌ సీజన్‌లో మండ లంలో సాగైన వరి పంట ను ఉల్లికోడు దెబ్బ తీస్తోంది.

పరిశీలిస్తున్న సంయుక్త వ్యవసాయ సంచాలకులు మురళీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిశీలించిన జిల్లా అధికారులు

ఖాజీపేట, అక్టోబరు 30: ఖరీఫ్‌ సీజన్‌లో మండ లంలో సాగైన వరి పంట ను ఉల్లికోడు దెబ్బ తీస్తోంది. మండలంలో 11 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొదట్లో వరి ఆశాజనకంగా పెరుగుతుండడంతో రైతన్నకు ఆశలు చిగురించాయి. చివరిగా పొట్టదశకు వచ్చేసరికి ఉల్లికోడ్‌ వచ్చింది. దీంతో దిగుబడి తగి ఎక్కువగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి సాగుచేస్తే చివరికి ఇలా జరిగిందని వాపోతున్నారు. రావణపల్లెలోని వరి పంటను జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు జె.మురళీకృష్ణ, ఏఓ శివశైలజ పరిశీలించారు. వెన్నుదశ రాకముందే ఉల్లికోడును నివారించుకోవాలన్నారు. దిగుబడిని బటి ్ట ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. 

నత్రజని ఎరువులను వాడరాదు

మైదుకూరు రూరల్‌, అక్టోబరు 30: ప్రస్తుత వాతావరణంలో వరి పైరులో నత్రజని ఎరు వులను వాడరాదని మండల వ్యవసాయశా ఖ అధికారి లక్ష్మీప్రసన్న వరి రైతులను ఉద్దేశించి అన్నారు. పట్టణ పరిధి లోని వరి పొలాలను శనివారం ఆమె పరిశీలించారు. రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వరి పైరులో ఆకుమచ్చ, ఆకు ముడత, దోమపోటు, ఉల్లికోడు లాంటి తెగుళ్లు రాకుండా నివారణ చర్యలను రైతులు అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగార్జున తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-31T05:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising