ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్‌ ఏర్పాటు

ABN, First Publish Date - 2021-02-06T05:17:01+05:30

ప్రజలకు, వ్యాపారులకు అం దరికీ అమోదయోగ్యంగా అరునెలల్లో అత్యాధునిక సౌకర్యవంతమైన కూరగాయల మార్కెట్‌ నిర్మిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

మున్సిపల్‌ మార్కెట్‌ భవన నిర్మాణాల కోసం కమిషనర్‌కు నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 5 : ప్రజలకు, వ్యాపారులకు అం దరికీ అమోదయోగ్యంగా అరునెలల్లో అత్యాధునిక సౌకర్యవంతమైన కూరగాయల మార్కెట్‌ నిర్మిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 70 సెంట్లలో మార్కెట్‌ ఉందని, దానిని 2 ఎకరాల 70 సెంట్లలో నిర్మించనున్నట్లు తెలిపారు. అంతవరకు తాత్కాలికంగా త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఖాళీ జాగాలో పండ్లు, పూల మార్కెట్‌ను, అదే విధంగా అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాత్కాలిక మార్కెట్‌ నిర్మాణంకు రూ.50లక్షలు వ్యయం అవుతుందని, ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలంటే 5 నెలల కాలం పట్టవచ్చన్నారు. దీని వల్ల ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందిగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ రూ.50లక్షలు తాను ఇస్తానని, అనుమతులు వచ్చాక ఆ మొత్తాన్ని మున్సిపల్‌ అధికారులు తనకు ఇవ్వాల్సి ఉంటుం దన్నారు. ఈ మేరకు రూ.50లక్షల నగదును మున్సిపల్‌ కమిషనర్‌ రాధకు అందించారు. సమావేశంలో మున్సిపల్‌ అధికారులు, మార్కెట్‌ వ్యాపారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T05:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising