ఘనంగా ధన్వంతరి జయంతి
ABN, First Publish Date - 2021-11-03T05:20:06+05:30
ప్రొద్దుటూరు నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ప్రొద్దుటూరు టౌన్, నవంబరు 2: శ్రీనివాసనగర్ సరస్వతీదేవి ఆలయంలో ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కిశోర్ మాట్లాడుతూ మొదటి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి అని వ్యాధుల నివారణకు ధన్వంతరి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యరంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రబాబు, శేషాద్రి, పెద్దన్న, సుబ్బయ్య, వెంకటరాముడు, రామమద్దిలేటి, కిరణ్, మల్లయ్య, నాగేషు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-11-03T05:20:06+05:30 IST