ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే..

ABN, First Publish Date - 2021-12-31T05:14:13+05:30

మద్యం తాగి వా హనాలు నడిపితే జైలుశిక్ష తప్పదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడిపితే ప్రమాదాలు నివారించవచ్చని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలి పారు.

విద్యార్థులకు మాస్కులు అందజేస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంజనీరింగ్‌ విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో ఎస్పీ 

కడప(క్రైం), డిసెంబరు 30: మద్యం తాగి వా హనాలు నడిపితే జైలుశిక్ష తప్పదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడిపితే ప్రమాదాలు నివారించవచ్చని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలి పారు. గురువారం కేఎ్‌సఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో వి ద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో ఎస్పీ అన్బురాజన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, విద్యార్థులు తమ ప్రాణాలనే కాకుండా తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనాలను నడపాలని, కుటుంబానికి తీరని వ్యథను మిగల్చవద్దని అన్నారు. తాగి వాహనం నడిపే ప్రతిఒక ్కరూ మానవ బాంబులాంటి వారేనన్నారు. మద్యం తాగడం, అతివేగం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటివి చేయకుండా క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు, స్పీడ్‌ లేజర్‌ గన్‌ ద్వారా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.  మైనర్లకు వాహనాలు ఇస్తే నడిపిన వారిపై, వాహనం ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మొబైల్‌కు వచ్చే అపరిచితుల మెసేజ్‌లను, లింకులను క్లిక్‌ చేయవద్దని సూచించారు. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, కడప రూరల్‌ సీఐ శ్రీరామ్‌ శ్రీనివాస్‌, చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి, కళాశాల కరస్పాండెంట్‌ చంద్ర ఓబులరెడ్డి, ఇంజనీరింగ్‌ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising