ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేయూత అర్హత కోసం మహిళల నిరీక్షణ

ABN, First Publish Date - 2021-05-31T04:11:51+05:30

‘జగన న్న చేయూత’ పొందేం దుకు ప్రభుత్వం ప్రక టించినట్లు ఆధార్‌ అప్‌ డేట్‌ చేయించుకునేందు కు మహిళలు నిరీక్షిస్తు న్నారు.

ఆధార్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆధార్‌ అప్‌డేట్‌ కోసం పడిగాపులు

పులివెందుల టౌన/ రూరల్‌, మే 30: ‘జగన న్న చేయూత’ పొందేం దుకు ప్రభుత్వం ప్రక టించినట్లు ఆధార్‌ అప్‌ డేట్‌ చేయించుకునేందు కు మహిళలు నిరీక్షిస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు జగనన్న చేయూత పథకం కింద ఆర్థిక స్వావలంబన చేకూర్చనుంది. ఈ పథకానికి అర్హత పొందేందుకు ఆధార్‌ సెంటర్ల వద్ద మహిళలు పడిగాపులు కాస్తున్నారు. ‘జగనన్న చేయూత’ కింద రూ.18,750 నగదు అర్హత గల మహిళలకు ఏటా అందిస్తోంది.

అయితే ప్రభుత్వం ఆధార్‌ హిస్టరీ తప్పని సరి చేస్తూ లబ్ధిదారులు ఆధార్‌కు ఫోన నెంబర్‌ లింక్‌ చేసుకోవాలని నిబంధన పెట్టింది. దీంతో పట్టణంలోని పలు ఆధార్‌ సెంటర్లలో ఉదయం నుంచి అప్‌డేట్‌ కోసం పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ కడుతున్నారు. కాగా గతంలో లబ్ధి పొందిన వారికి అవసరం లేదని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు.

ఈ ఏడాది దరఖాస్తు చేసుకు నే మహిళలు మాత్రమే ఆధార్‌కు సెల్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45ఏళ్లు పూర్తైన వారు మాత్రమే ఫోన నెంబర్‌ను లింకు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ పథకానికి అర్హత పొంది, ఆధార్‌ లింకు చేసుకున్న వారు మరోమారు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఏడాదితో 60ఏళ్లు పూర్తైన వారి పేర్లు తొలగిస్తారని తెలిపారు. వలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేయాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-05-31T04:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising