ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రం వైపు.. వరి రైతు చూపు

ABN, First Publish Date - 2021-12-27T05:24:00+05:30

భారీవర్షాలకు అష్టకష్టాలు పడి సాగుచేసిన వరి పంటకు గిట్టుబాటు ధరలేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆరబోసిన వరి ధాన్యం బస్తాలకు నింపుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 26: భారీవర్షాలకు అష్టకష్టాలు పడి సాగుచేసిన వరి పంటకు గిట్టుబాటు ధరలేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో  ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమను  ఆదుకోవాలని రైతులు  కోరుతున్నారు.  ఈ ఏడు భారీవ ర్షాల తో వరిపంట చేతికి వచ్చే సమయంలో బాగాదెబ్బతిన్న విష యం విదితమే. అయితే  ఏదో విధంగా దిగుబడి తగ్గినా చేతికి వచ్చిన పంటను సకాలంలో అమ్ముకోవడానికి రైతులు గిట్టుబా టు ధరలేక నానాఅవస్థలు పడుతున్నారు. ఈతరుణంలో కనీసం నియోజక వర్గ కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని పలు వురు వరి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మలమడుగు మండలంలోని గొరిగెనూరు, ధర్మాపురం, సలివెందుల, దేవగుడి, అంబవరం తదితర ప్రాంతాల్లో వరి పంట విస్తారంగా సాగుచేసి ప్రస్తుతం పంటను నూర్పిళ్లుచేసి ప్రధా న రోడ్లపై ఆరబోశారు. గత రెండు సంవత్సరాల నుంచి వరి సాగు చేసిన రైతులకు వర్షాలతో భారీగా నష్టం జరుగుతూనే ఉంది. దీంతో ప్రభుత్వం ఇస్తున్న సాయం ఏమాత్రం సంతృప్తికరంగా లేదని తాము ఆరుగాలం కష్టించి పంట చేతికందివచ్చే సమయంలో వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.  ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొందన్నా రు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడంలేదని ఇటీవల పండించిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు తక్కువ ధరకు అడుగుతున్నారన్నారు. ఇలా అయితే తమ పరిస్థితి ఏమిటం టూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ముఖ్యమం త్రి జగన్‌మోహన్‌రెడ్డి వరి రైతుల కష్టాలను, ఇబ్బందులను పరిష్కరించే దిశగా  జమ్మలమడుగు మార్కెట్‌యార్డు లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-12-27T05:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising