విషజ్వరాల పట్ల అప్రమత్తత అవసరం
ABN, First Publish Date - 2021-12-20T04:55:53+05:30
మండలంలోని దిగువ కుమ్మరపల్లెలో డెంగ్యూ కేసు నమోదైన నేపధ్యంలో ఆదివారం నందలూరు వైద్యశాఖ, జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
నందలూరు, డిసెంబరు19 : మండలంలోని దిగువ కుమ్మరపల్లెలో డెంగ్యూ కేసు నమోదైన నేపధ్యంలో ఆదివారం నందలూరు వైద్యశాఖ, జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిల్వ నీటిలో క్రిమిసంహారక మందుల పిచికారీ, ఇంటింటికీ క్రిమి సంహారక మందు పిచికారీ, జ్వర సర్వే అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి సుబ్బరాయుడు, వైద్య సిబ్బంది, లక్ష్మయ్య, ఏఎన్‌ఎంలు విజయ, సుజాత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-20T04:55:53+05:30 IST