ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాల తొలగింపు

ABN, First Publish Date - 2021-08-21T04:49:56+05:30

ఎట్టకేలకు స్థానిక జిల్లా ఆసుపత్రిలో వ్యర్థాలను తొలగిం చారు.

వ్యర్థాలను ఎక్స్‌కవేటర్‌తో తొలగిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

ప్రొద్దుటూరు అర్బన్‌, ఆగస్టు 20 : ఎట్టకేలకు స్థానిక జిల్లా ఆసుపత్రిలో వ్యర్థాలను తొలగిం చారు. ఆసుపత్రిలో వ్యర్థాల నిర్వహణపై శక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘జిల్లా ఆసుపత్రికి చికిత్సచేయాలి’ అనే కఽథనం రావడంతో వైద్యాధికారులు కదిలారు. జిల్లా ఆసుపత్రిలో గుట్టలుగా పేరుకున్న వ్యర్థాలను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డెవిడ్‌ సెల్వన్‌ రాజ్‌, ఆర్‌ఎంఓ ఆనందబాబులు పరిశీలించారు. శానిటరీ కాం ట్రాక్టర్‌ను వెంటనే వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. బయోవ్యర్థాలను కాల్చడంపై శానిటరీ మేస్త్రీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం  చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని విధుల నుంచి తొలగింపు జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటి నుంచి ఏరోజు వ్యర్థాలను ఆరోజు తొలగించేలన్నారు. పారిశుధ్య సిబ్బంది హాజరు పై ఆరా తీశారు. మస్టర్‌ను పరిశీలించారు.మూడు షిప్టుల్లో ఏ షిప్టుడ్యూటీ వారు ఆషిప్టులో తప్పనిసరి సిబ్బంది పనులకు హాజరుకావాన్నారు. అధికారుల తనిఖీలో లేనట్లు తేలితే విధుల నుంచితొలగిస్తామని హెచ్చరించారు. దీంతో ఆసుపత్రి శానిటరీ మేస్త్రీ సుబ్బరాయుడు ఎక్స్‌కవేటర్‌తో వ్యర్థాలను తొలగించారు. ఆ ప్రదేశంలో బ్లిచింగ్‌ పౌడర్‌ను చల్లి శుభ్రం చేశారు. బయోవ్యర్థాలకు సంబంధించి వాటిని తీసుకెళ్లే వాహనాలు సకాలంలో ఎందుకు రావడంలేదో విచారించారు. వాటిని ఎప్పటికప్పుడు తరలించేలా కాంట్రాక్టర్‌ దే బాధ్యత అన్నారు. ఈ పనుల పర్యవేక్షణలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజారత్నం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-08-21T04:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising