ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ హయాంలో సంక్షేమం కనుమరుగు : టీడీపీ

ABN, First Publish Date - 2021-06-23T05:07:50+05:30

వైసీపీ హయాంలో సంక్షేమం కనుమరుగైందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొలవళి వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

బద్వేలులో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జూన్‌ 22: వైసీపీ హయాంలో సంక్షేమం కనుమరుగైందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొలవళి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మంగళవారం నాయిబ్రాహ్మణులు బ్యాండు మేళం వాయిస్తూ, క్షవరం చే స్తూ, రజకులు బట్టలు ఇస్ర్తీ చేస్తూ, చర్మకారులు చెప్పు లు కుడుతూ విశ్వబ్రాహ్మణులు వడ్రంగి పనిచేస్తూ, చిరువ్యాపారులు కూరగాయలు, పండ్లు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, టీడీపీ బద్వేలు నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌, కడప పార్లమెంటు టీ డీపీ మహిళా అధ్యక్షురాలు కె.శ్వేతారెడ్డి మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకం కొనసాగి ఉంటే కొవిడ్‌తో మరణించిన ప్రతికుటుంబానికి రూ.10లక్షల ఆరి ్థక సహా యం వచ్చేదని, కానీ ఆ పథకాన్ని నిలిపేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం కొవిడ్‌ మృతుని కుటుంబానికి రూ.10లక్షలు పరిహా రం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆక్సిజన్‌ కొరతతో మృతిచెందిన వారి కుటుంబాల కు ప్రభుత్వమే బాధ్యత వహించి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, ప్రైవేటు ఉపాఽధ్యాయులను ఆదుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.అన్న క్యాంటిన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలన్నారు. ఆనందయ్య మందు తయారీకి అవసరమైన వస్తువులను ప్రభుత్వం అం దించి రాష్ట్రం మంతటా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ షేక్‌ మహబూబ్‌బాష, వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మహమ్మద్‌ హుసేన్‌, మిత్తికాయల సునీత రమణ, సుబ్బరాజు, దానం, టీడీపీ సీనియర్‌ నేత వీరారెడ్డి, బద్వేలు నియోజకవర్గ ప్రైవేటు టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు డాక్టర్‌ వెంకటయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising