ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

194 కేసులు.. ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2021-08-27T05:59:22+05:30

194 కేసులు.. ముగ్గురు మృతి

అగినపర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శానిటేషన్‌ చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గురువారం మరో ముగ్గురు కరోనా బాఽధితులు మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 194 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,13,074కు పెరిగాయి. మరణాలు అధికారికంగా 1,292కు చేరాయి.  జిల్లావ్యాప్తంగా వైరస్‌ బారినపడిన వారిలో ఇప్పటివరకు 1,09,465 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 2,317 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

అగినపర్రు స్కూల్లో విద్యార్థినికి పాజిటివ్‌

అగినపర్రు (పమిడిముక్కల) : అగినపర్రు జిల్లా  పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సిబ్బంది, విద్యార్థుల్లో ఆందోళన ఏర్పడింది. బొడ్డువానిగూడేనికి చెందిన గర్భిణీకి ఉయ్యూరులో పరీక్షలు చేయగా, పాజిటివ్‌ రిపోర్టు రావటంతో విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆ గర్భిణీ కుటుంబ సభ్యులకు గురువారం పరీక్షలు చేయగా, ఆమె భర్త, ఆడపడుచు (విద్యార్థిని)కు పాజిటివ్‌ వచ్చిందని కపిలేశ్వరపురం పీహెచ్‌సీ వైద్యురాలు మృదుల తెలిపారు. ఆ విద్యార్థినిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి, తరగతి గదులు, ఆవరణను శానిటైజ్‌ చేశామన్నారు. విద్యార్థులందరికీ కొవిడ్‌ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.


Updated Date - 2021-08-27T05:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising