జగన్ ప్రభుత్వంపై దేవినేని ఉమా ఫైర్
ABN, First Publish Date - 2021-06-30T21:13:48+05:30
పోలవరం డ్యామ్ సైట్‌లో జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ. 445 కోట్లేనని..
విజయవాడ: పోలవరం డ్యామ్ సైట్‌లో జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ. 445 కోట్లేనని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల బాధలను పట్టిచుకోని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితుల సాధక, బాధలు తీర్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై మండిపడ్డారు.
పునరావాసం లేక, ఎక్కడికి వెళ్లాలో తెలియనిస్థితిలో వందలగ్రామాల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని, నిర్వాసితులు బిక్కుబిక్కుమంటూ కొండలు, గుట్టలపై నివాసం ఉంటున్నారన్నారు. ప్రభుత్వానికి పోలవరం నిర్వాసితుల కష్టాలు పట్టడంలేదని మండిపడ్డారు. ప్యాకేజీ, నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ అందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి మూడోయేడు కూడా ముంచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-06-30T21:13:48+05:30 IST