ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో భారంపై ఆందోళన

ABN, First Publish Date - 2021-01-13T06:14:44+05:30

పెట్రో భారంపై ఆందోళన

వినూత్న నిరసనలో నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఎన్టీయూసీ వినూత్న నిరసన

వన్‌టౌన్‌, జనవరి 12:   రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మూడు అంకెలకు పరుగులు పెడుతున్నాయని, సామాన్యు లు పెట్రోభారం భరించలేని స్థితిలో ఉన్నారని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పన్నులు విధించడాన్ని నిరసిస్తూ మంగళవారం గాంధీ నగర్‌లోని ధర్నా చౌక్‌ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఎద్దుల బండిపై ఆటోను ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడు ప్రజలపై భారాలు పడకుండా పెట్రోల్‌పై రూ. 2, డీజిల్‌పై రూ. 2 తగ్గించారని ఆయన అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని లేని పక్షంలో టీఎన్టీ యూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రఘురామరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులు పి.ప్రసాద్‌, ఆర్‌.శ్యామ్‌, బి.సురేష్‌బాబు, జె.శ్రీను, డి.శ్రీను, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

వాహనదారుల నడ్డి విరుస్తున్నారు

విద్యాధరపురం : ముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డి అమ్మఒడి కింద డబ్బులు ఇచ్చి, మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌ చార్జీలు విపరీతంగా పెంచి వాహన దారులు నడ్డి విరుస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విజయవాడ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి దొండపాటి విజయ్‌కుమార్‌ విమర్శించారు. మంగళవారం ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్ల పరి స్థితి అధ్వానంగా ఉందన్నారు. ప్రజలు ఉద్యమించాలన్నారు.  



Updated Date - 2021-01-13T06:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising