ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్జీఎస్‌లోకి విద్యార్థులకునో ఎంట్రీ

ABN, First Publish Date - 2021-12-19T06:24:40+05:30

ఎస్జీఎస్‌ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను శనివారం కళాశాలలోకి పోలీసులు అనుమతించలేదు.

కళాశాల గేటు తీయకపోవటంతో రోడ్డున పడ్డ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం కార్యాలయంలో పరీక్షలకు సిద్ధం

జగ్గయ్యపేట, డిసెంబరు 18: ఎస్జీఎస్‌ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను శనివారం కళాశాలలోకి పోలీసులు అనుమతించలేదు. కళాశాలను అన్‌ ఎయిడెడ్‌గానే నడుపుతామని కళాశాల యాజమాన్యం ప్రకటించినా పట్టు వదలని విద్యార్థులు కళాశాలలో 144వ సెక్షన్‌ విధించినా సామూహికంగా దీక్షలు చే స్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ చలో జగ్గయ్యపేటను భగ్నం చేశాక మేనేజిమెంట్‌ విద్యార్థులపై ఎదురుదాడికి దిగింది.  కళాశాలలోకి రానివ్వకుండా అడ్డుకుంది. కళాశాల బయట పోలీసులు వెనక్కు పంపటంతో వారంతా పట్టణంలో డీవీ ఆర్‌నగర్‌లో ఉన్న సీపీఎం కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం వరకు అక్కడే చదువుకుని వెళ్లి పోయారు. యాజమాన్యం శాంతియుత ఆందోళనను కూడా సహించలేకుందని, పోలీసులతో తమ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. 

పాయకాపురం: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాలను ప్రైవేట్‌ కళాశాలగా మార్చవద్దని, ఎయిడెడ్‌ కళాశాలగానే కొనసాగించాలని కలెక్టర్‌ జె.నివాస్‌కు, తన కార్యాలయంలో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కళాశాల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్‌ జె.నివాస్‌ వారికి తెలిపారు. అర్హులైన ప్రతీఒక్క విద్యార్థికి  అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వర్తింపచేస్తామని, ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. 

Updated Date - 2021-12-19T06:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising