ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-04-20T05:57:42+05:30

రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం

రైతులతో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంకిపాడు, ఏప్రిల్‌ 19 :  రైతు శ్రేయస్సును గాలికి వదిలేసిన అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. మండలంలోని కోమటిగుంట, తెన్నేరు గ్రామాలలో సోమవారం ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా ఎక్కడా కనిపించడం లేదన్నారు. రైతులను ఆర్థికంగా కుంగతీసిందన్నారు. దాళ్వా కోతలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన 1153, 1156 రకాల విత్తనాలను సాగు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ చెప్పిన విధంగానే సాగు చేప్పటినప్పటికీ ప్రభుత్వ మద్దతు ధర కాకుండా రూ. 900కే ధాన్యాన్ని తుగనమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎకరాకు రూ. 10 వేలు వరకు రైతులు నష్ట పోయారన్నారు. గుడ్డి ప్రభుత్వం మేలుకోవాలని పిలుపునిచ్చారు. రైతుపేర్లు నమోదు చేసుకునేందుకు అవసరమైన ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రారంభించలేదన్నారు. రోడ్డుపై దాన్యాన్ని పోసి రైతులు రోడ్డు ఎక్కేందుకు సిద్ధ పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులకు మద్దతుగా నిలుస్తామని,  పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపతామని  చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సుదిమళ్ల రవీంద్ర, టీడీపీ నాయకులు యార్లగడ్డ రాజ, గద్దె నాగేశ్వరరావు, రైతులు వజ్జే సూర్యప్రకాశరావు, బడుగు శ్రీనివాసరావు, నల్లమోతు స్టాలిన్‌, బడుగు మల్లికార్జునరావు, గుర్రాల రాధకృష్ణ, యార్లగడ్డ మధుసూదనరావు, బి. శివ, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-20T05:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising