ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహ్‌.. హెచ్‌సీఎల్‌!

ABN, First Publish Date - 2021-01-29T06:35:45+05:30

అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాంపస్‌ విశేషాలను ఆవిష్కరించిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 

రెండు టవర్లలో అధునాతన సదుపాయాలు 

నిర్మాణ తుది దశలో మూడో టవర్‌ నిర్మాణం 

ఊపందుకున్న కేఫ్‌టీరియా పనులు 

అడుగడుగునా పచ్చదనం.. 

మీడియా టూర్‌లో ప్రజంటేషన్‌ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే 30 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ రూపుదిద్దుకుంది. కొవిడ్‌ ముందు సేవలను ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ విశేషాలను తెలియచెప్పటం కోసం గురువారం సంస్థ యాజమాన్యం మీడియా టూర్‌ను నిర్వహించింది. ఈ టూర్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివశంకర్‌ క్యాంపస్‌ గురించి ప్రత్యేకంగా వివరించారు. క్యాంపస్‌లో మొత్తం మూడు టవర్లను నిర్మించాల్సి ఉంది. వీటిలో రెండు టవర్లు అధునాతన సదుపాయాలతో అలరారుతున్నాయి. మూడో టవర్‌ నిర్మాణం తుది దశలో ఉంది. ఉద్యోగుల కోసం అద్భుతమైన కేఫ్‌టీరియాను కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కేఫ్‌ను అభివృద్ధి చేశారు. ఔత్సాహికులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నిర్మించారు. త్వరలో మూడో టవర్‌ నిర్మాణం అందుబాటులోకి రావటంతో పాటు, అధునాతన వసతులతో కూడిన కేఫ్‌టీరియా కూడా సిద్ధం కానుంది. 


సువిశాల విస్తీర్ణంలో ప్రధాన మార్గానికి అభిముఖంగా టవర్‌-1 ఉంది. దీనికి ఎడమవైపు టవర్‌-2ను నిర్మించారు. వెనుకవైపు మూడో టవర్‌ను నిర్మిస్తున్నారు. టవర్‌-1, 3 అన్నింటికంటే భారీగా ఉంటాయి. వాయువ్య దిశలో కేఫ్‌టీరియాను నిర్మిస్తున్నారు. సమీపంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఉంది. అభివృద్ధి చెందిన నగరాలలోని ఐటీ భవనాల్లా కనిపించే ఈ టవర్ల ఇంటీరియర్‌ మొదలు వర్క్‌ గ్రూప్స్‌ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి టవర్‌లో మూడు ఫ్లోర్లుంటాయి. ఉద్యోగుల వర్క్‌ ఏరియాలో లగ్జరీ సీటింగ్‌, వేగవంతమైన ఇంటర్‌నెట్‌, కంప్యూటర్స్‌, ల్యాప్‌ట్యాపల్‌లు ఉన్నాయి. చుట్టూ పచ్చదనంతో పరిసరాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అధునాతన భవనాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఈ క్యాంపస్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాలనుకున్నా, కొవిడ్‌ కారణంగా సాధ్యం కాలేదని హెచ్‌సీఎల్‌ మేనేజ్‌మెంట్‌ వివరించింది. ఈ ఇంటర్‌నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో ప్రస్తుతం 1500 మంది పనిచేస్తున్నారు. మరో వెయ్యి మంది ఉద్యోగుల కోసం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వర్చువల్‌ మెగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్టు మేనేజ్‌మెంట్‌ వివరించింది. 


ఈ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణం

గన్నవరంలో సువిశాలమైన ఈ ప్రదేశాన్ని చూశాక ఎంతో ముచ్చట వేసింది. ఇక్కడ ఎన్నో చెట్లున్నాయి. వీటిని తొలగించకుండా భవనాలను నిర్మించాం. ఇప్పుడింత ఆహ్లాదంగా కనిపించడానికి కారణం ఈ పచ్చదనమే. క్యాంపస్‌లో టవర్‌ నిర్మాణాలతో పాటు కేఫ్‌టీరియా వంటివాటిని పూర్తిగా విజయవాడ నేపథ్యం ఉట్టిపడేలా, అమరావతి బౌద్ధ కల్చర్‌ను కలగలిపి నిర్మించాం. రాష్ట్రంలోని గ్రామీణ సంస్కృతిని కూడా మేళవించి నిర్మాణాలను చేపట్టాం. ఈ క్యాంపస్‌ అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. గత ఏడాది ఫిబ్రవరిలో తొలి బ్యాచ్‌ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులతో పూజ నిర్వహించాం. ఏప్రిల్‌లో గ్రాండ్‌గా ప్రారంభించాలనుకున్నాం. కొవిడ్‌ కారణంగా ఆ పని చేయలేకపోయాం. త్వరలోనే ఓ మంచి కార్యక్రమం నిర్వహిస్తాం. 

- శివశంకర్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

Updated Date - 2021-01-29T06:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising