ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వ తీరుతో అంత రివర్స్

ABN, First Publish Date - 2021-10-07T17:48:29+05:30

నాడు అమరావతికి వచ్చే ప్రయత్నాలు చేసిన ప్రముఖ ఆస్పత్రులు నేడు ఏపీకి రాంరాం అంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నాడు అమరావతికి వచ్చే ప్రయత్నాలు చేసిన ప్రముఖ ఆస్పత్రులు నేడు ఏపీకి రాంరాం అంటున్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుతో అంతా రివర్స్ అయింది. పలు వైద్య సంస్థలు ఏపీ వైపు చూడ్డానికి వెనకడుగు వేస్తున్నాయి. కొత్తగా వచ్చే వాటి సంగతి పక్కన పెడితే.. ఇప్పటికే సేవలందిస్తున్న సంస్థలు అభద్రతా భావంతో పక్కచూపులు చూస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే తీసుకున్న రివర్స్ నిర్ణయాలు కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులపై మితిమీరిన ఆంక్షలే దీనికి కారణమని వైద్య వర్గాలు చెబుతున్నాయి.


బీమా ఉండి, ఖర్చు భరించే శక్తి ఉన్నవారు తీవ్రమైన ఆరోగ్య చికిత్సల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకే  వెళుతున్నారు. గుండె శస్త్ర  చికిత్సకు అత్యధికులు హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇక కేన్సర్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది బసవతారకం ఆస్పత్రే. బ్రెయిన్ సర్జరీలు, కాలేయ మార్పిడి చికిత్సలకు పొరుగు రాష్ట్రాలకే పరుగుతీస్తున్నారు. నవ్యాంధ్ర ఏర్పడి ఏడేళ్లు దాటినా క్రిటికల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు తగిన స్థాయిలో లేవు.


కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఏపీలోని అన్నివైపుల నుంచి అంబులెన్సులు హైదరాబాద్‌కు బారులుతీరాయి. చివరికి ఇతర రాష్ట్రాల వారికి అనుమతి లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లోనే నిలిపేసింది. కోవిడ్ సోకిన కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు సయితం పొరుగు రాష్ట్రంలోని ఆస్పత్రులనే నమ్ముకుని అక్కడే చికిత్స పొందిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-10-07T17:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising