ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణం లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-10-07T06:30:51+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్‌లలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి లక్ష్యాలను పూర్తి చేయాలని జేసీ(ఆసరా) కె.మోహన్‌ కుమార్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ, అక్టోబరు 6 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్‌లలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి లక్ష్యాలను పూర్తి చేయాలని జేసీ(ఆసరా) కె.మోహన్‌ కుమార్‌ ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆయన డివిజన్‌లోని తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, హౌసింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, అధికారులతో జగనన్న గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు.హౌసింగ్‌ పీడీ రామచంద్రన్‌, ఆర్డీవో శ్రీను కుమార్‌లు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లోని తొమ్మిది మండలాలలో 322 లేఅవుట్‌లలో మొదటి దశలో 22,154 గృహాల లక్ష్యానికి ఇప్పటి వరకు 1208 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకర ఇతర నిర్మాణ సామాగ్రిని సచివాలయాలు, మండల కేంద్రాల్లో చెరి 50 శాతం వంతున నిల్వ ఉంచాలని సూచించారు. మండలాల వారీ లేఅవుట్లను ఉన్నతాధికారులు తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. మండ లాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, హౌసింగ్‌ ఏఈలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.50 వేలు మంజూరు అయ్యే విధంగా ఎంపీడీవో, ఏపీవోలు శ్రద్ధ తీసుకో వాలన్నారు. వాటర్‌, విద్యుత్‌, నీరు రోడ్లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్టోబరు చివరి నుంచి చేపట్టే నిర్మాణాలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాలని సూచించారు. కైకలూరు నియోజకవర్గంలో 172 లేఅవుట్లలో 6100 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 605 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. గుడివాడ నియోజకవర్గ 84 లేఅవుట్లలో 9808 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 359 గృహాలు, పామర్రు నియోజక వర్గంలోని పామర్రు, పెదపారుపూడి మండలాల్లోని 66 లేఅవుట్లలో 6246 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 244 ఇళ్లు వివిధ నిర్మాణదశల్లో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో స్వామినాయుడు, హౌసింగ్‌ డీఈలు రమే్‌షబాబు, రామోజీనాయక్‌, ఆదినారాయణ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-07T06:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising