ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులు లేని విధులు

ABN, First Publish Date - 2021-08-10T06:00:55+05:30

నిధులు లేని విధులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచాయతీ నిధులపై ప్రభుత్వ పెత్తనం

సీఎఫ్‌ఎంఎస్‌ పేరుతో నిధుల నియంత్రణ

గ్రామ సదుపాయాలు, సిబ్బంది జీతాలకూ కష్టమే

పంచాయతీ కార్యదర్శులపై భారం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. గ్రామాల్లో పారిశుధ్యం మొదలు మౌలిక సదుపాయాల వరకు పైసా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. నిధులున్న పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. అంతా ప్రభుత్వ నియంత్రణే నడుస్తోంది. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌ఎంఎస్‌) పరిధిలోకి రావటం మంచి విషయమే అయినా, దీనిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నిధుల విడుదలకు మోకాలడ్డుతోంది. నిధుల నిర్వహణను తన నియంత్రణలోకి తీసుకుంది. దీంతో చేసిన పనులకు డబ్బులు ఇవ్వాలన్నా, పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలన్నా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు పంచాయతీలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో చేయాల్సిన పనులకు సంబంధించి చెక్‌ పవర్‌ ఎవరికి ఉందన్న సంగతి కూడా ఆలోచించకుండా గ్రామ కార్యదర్శులను బాధ్యులను చేస్తున్నారు. నిధులు ఎక్కడి నుంచి తేవాలన్న విషయం తెలిసి కూడా ఉన్నతాధికారులు వ్యవహరించటం ఆందోళనను కలిగిస్తోంది.  

అన్నింటికీ అడ్డు

సాధారణంగా గ్రామాల్లో ఖర్చు చేయటం కోసం 14, 15 ఆర్థిక సంఘం నిధులు ఉంటాయి. వీటిని కూడా ఖర్చు చేసుకోనివ్వకుండా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఉన్నతాధికారుల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. కాగా, ప్రభుత్వం అట్టహాసంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఫర్నీచర్‌ ఏర్పాటును పంచాయతీలపై పడేసింది. సచివాలయంలో స్టేషనరీ, బోర్డులు, కంప్యూటర్‌ రిపేర్లు, సిబ్బంది చిల్లర ఖర్చులు అన్నీ గ్రామ కార్యదర్శులే భరించాలి. అలాగే, సచివాలయాల్లో కార్పొరేట్‌ స్థాయి నిర్వహణ ఉండాలంటున్న ప్రభుత్వం నిధుల గురించి మాత్రం మాట్లాడట్లేదు.

జీతాలకూ నిల్‌

నిధులు లేక ఒకవైపు, నిధులున్నా అందక మరోవైపు జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. వీరి జీతాలకు కూడా గ్రామ కార్యదర్శులు నిధులు రాబట్టలేని అసహాయ స్థితిలో ఉన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ సైట్‌ ద్వారా సిబ్బంది జీతాలు డ్రా చేసుకుందామనుకున్నా ఇబ్బందిగానే మారింది. సైట్‌ పనిచేయక పోవటంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు తాళలేక అప్పులు చేయాల్సి వస్తోంది.

Updated Date - 2021-08-10T06:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising