ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-05-05T17:54:25+05:30

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టడంలోనే కుట్ర బహిర్గతమైందని తెలిపారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డైరీ రైతులను బలి తీసుకున్నారని మండిపడ్డారు. తెలుగు భాషపై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమూల్‌కు పాలు రాకపోవడంతో కక్షగట్టారన్నారు. బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయమని నిలదీశారు. అమూల్‌కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 

Updated Date - 2021-05-05T17:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising