ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు ఉత్తమ సేవలందించాలి

ABN, First Publish Date - 2021-08-20T06:05:53+05:30

ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తించాలని మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ఎం వెంకటరమణరావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, ఆగస్టు 19 : ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తించాలని మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ఎం వెంకటరమణరావు సూచించారు. గురువారం కొర్లకుంట, చింతల వల్లి గ్రామ సచివాలయాలు, ఎంపీయూపీ పాఠశాలను ఎంపీ డీవో సత్యనారయణతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను పరిశీలించిన వెంకటరమణరావు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో నాడు - నేడు పనులను  పరిశీలించారు. విద్యార్థుల హజరు, మధ్యాహ్న భోజన మోను రికార్డులను తనిఖీ చేశారు.  అనంతరం గోగులంపాడులో రైతుభరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ల నూతన భవన నిర్మాణాలను స్పెషల్‌ ఆఫీసర్‌ పరిశీలించి, అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిబంధనల ప్రకారం నిర్మాణాలను పూర్తిచేయాలని పీఆర్‌ ఏఈ నరసింహరావును ఆదేశించారు. వెంకట రమాణారావుతో పంచాయతీ కార్యాదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరావు, సచివాలయ కార్యాదర్శి రాకేష్‌ ఉన్నారు.


Updated Date - 2021-08-20T06:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising