ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరం రాసినా స్పందిస్తా: జడ్జి

ABN, First Publish Date - 2021-11-24T05:29:01+05:30

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సాయం కోసం ఉత్తరం రాసినా స్పందిస్తానని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, జిల్లా జడ్జి శ్రీనివాసులు తెలిపారు.

నిత్యావసర వస్తువులను అందజేస్తున్న జడ్జి శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 23: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సాయం కోసం ఉత్తరం రాసినా స్పందిస్తానని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, జిల్లా జడ్జి శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని జిల్లా పరిషత్‌లో మంగళవారం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలలహక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కరోనాతో తల్లిని గాని, తండ్రిని గాని కోల్పోయిన బాలలకు లీగల్‌ సెల్‌ అథారిటీ తరపున సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ మాట్లాడుతూ కరోనా ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వం రూ.10లక్షలను బ్యాంకులో డిపాజిట్‌ చేస్తుందని తెలిపారు. తల్లిని గాని, తండ్రిని గాని కోల్పోయిన 18 సంవత్సరాలలోపు చిన్నారులకు ప్రతి నెల రూ.500 చొప్పున ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో పీవోడీటీటీ డా.ఓ.ప్రభావతి, జువైనల్‌ హోం సూపరింటెండెంట్‌ రామ్మోహన్‌, జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటి సభ్యురాలు దివ్య, అర్బన్‌ సీడీపీవో వరలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ కమిటి సభ్యులు సీడీపీవో, డీసీపీవో శారద, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-11-24T05:29:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising