ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-09-03T05:27:37+05:30

ప్రజాస్వామ్యం ఇదేనా? అని మద్దికెర గ్రామస్థులు ప్రశ్నించారు. గురువారం మద్దికెరకు ఎమ్మెల్యే శ్రీదేవి వస్తున్నారని తెలుసుకున్న సాయినగర్‌, రాంనగర్‌ వాసులు సాయినగర్‌ కాలనీలోని దేవాలయం వద్ద గల రోడ్డుపై బైఠాయించారు.

నిరసనను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, సెప్టెంబరు 2: ప్రజాస్వామ్యం ఇదేనా? అని మద్దికెర గ్రామస్థులు ప్రశ్నించారు. గురువారం మద్దికెరకు ఎమ్మెల్యే శ్రీదేవి వస్తున్నారని తెలుసుకున్న సాయినగర్‌, రాంనగర్‌ వాసులు సాయినగర్‌ కాలనీలోని దేవాలయం వద్ద గల రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకు ఎలాంటి అనుమతి లేదని, ఇక్కడి నుంచి వెళ్లాలని తెలిపారు. అయితే ప్రజలు అక్కడే నిరసన తెలిపారు. పోలీసులు వారిని పక్కకు తరలించి ఎమ్మెల్యే కాన్వాయిని అపకుండా ముందుకు పంపించారు. అనంతరం కాలనీవాసులు రోడ్డుపైన బైఠాయించి మాట్లాడుతూ ఇచ్చిన హామీని ఎమ్మెల్యే విస్మరిస్తున్నారు. వారు మాట్లాడుతూ తమ కాలనీలో అంతా నిరుపేదలే ఉన్నామని కొళాయి కనెక్షన్‌ రూ.6వేలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. ఒక్కొక్క కనెక్షన్‌కు రూ.1000 వరకు చెల్లించగలమని, అంతకన్నా ఎక్కువ చెల్లించలేమని తెలిపారు. ఎమ్మెల్యే ఆదర్శ పాఠశాల వద్ద ఉన్న  విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి ఎమ్మెల్యే తమ బాధలను వెల్లబోసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 రోజులు సమయం ఇవ్వాలని, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Updated Date - 2021-09-03T05:27:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising