ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది రైతు దగాకోరు ప్రభుత్వం: గౌరు

ABN, First Publish Date - 2021-12-07T05:32:54+05:30

ఇది రైతు దగా కోరు ప్రభుత్వమని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు.

ధర్నాలో మాట్లాడుతున్న గౌరు వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాపిలి, డిసెంబరు 6: ఇది రైతు దగా కోరు ప్రభుత్వమని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ప్యాపిలిని కరువు మండలంగా ప్రకటించాలని టీడీపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో డోన్‌ టీడీపీ ఇన్‌చార్జీ ధర్మవరం సుబ్బారెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమని విమర్శించారు. పంటలకు మద్దతు ధర కల్పించడంలో, దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించడంలో, బీమా వర్తింపజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాను జగన్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అప్పులతో పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలువదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోని ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దారు శివరాముడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వలసల రామక్రిష్ణ, లక్ష్మీనారాయణయాదవ్‌, ఆర్‌ఈ నాగరాజు, అలేబాదు పరమేష్‌, ఎర్రగుంట్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, పెద్దపూదిళ్ల ప్రసాద్‌రెడ్డి, చిన్నసుంకయ్య, విజయ భట్టు, వెంకటరమణచారి, కాంతారెడ్డి, వీరాంజినేయులు, ఎస్‌. మధు పాల్గొన్నారు.

- కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని డోన్‌ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక లక్ష్మీనరసింహ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు వర్గ విభేదాలు మాని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గండికోట రామసుబ్బయ్య, రామ్మోహన్‌యాదవ్‌, కలచట్ల ప్రసాద్‌, బావిపల్లి లింగన్న, గార్లదిన్నె సుధాకర్‌, సుదర్శన్‌, విష్ణువర్ధన్‌, రమణగౌడు పాల్గొన్నారు.    


Updated Date - 2021-12-07T05:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising