సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో వసతుల కల్పనపై సమావేశం ప్రారంభం
ABN, First Publish Date - 2021-12-31T17:40:35+05:30
సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో వసతుల కల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటి మొదటి సమావేశం నేడు ప్రారంభమైంది.
అమరావతి : సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో వసతుల కల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటి మొదటి సమావేశం నేడు ప్రారంభమైంది. హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. 13 మంది సభ్యుల కమిటి వర్చువల్‌గా హాజరయ్యారు. టికెట్ ధరలు, ప్రేక్షకులకు అవసరమైన వసతులు, థియేటర్ల గ్రేడింగ్‌పై సమావేశంలో చర్చించనున్నారు. ప్రేక్షకులకు అదనపు భారం లేకుండా చూడాలని ఫిలిం క్రిటిక్స్ ప్రేక్షకుల సంఘం కోరుతోంది.
Updated Date - 2021-12-31T17:40:35+05:30 IST