వైసీపీ, టీడీపీ బడా కాంట్రాక్టర్లను ఏపీ బీజేపీ ఫండ్ అడిగిందా?
ABN, First Publish Date - 2021-04-14T09:15:03+05:30
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలిపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. సోమవారం నాయుడుపేట
కార్యకర్తలకు దిశానిర్దేశమేదీ?
ప్రచార వ్యూహాలు ఇలాగేనా?
బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై నడ్డా అసంతృప్తి!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలిపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. సోమవారం నాయుడుపేట సభలో పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేసిన ఆయన.. ఉప ఎన్నికలో విజయానికి రాష్ట్ర నేతలు అనుసరిస్తు న్న వ్యూహాలపై పెదవి విరిచినట్లు సమాచారం. బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని జాతీయ నాయకత్వం చెబుతు న్నా రాష్ట్ర నాయకులు పట్టించుకోలేదు. ప్రకటనలు, ట్వీట్లకే పరిమితమయ్యారు. కార్యకర్తలతోనూ సరిగా సమన్వయం చేసుకోకుండా అస్తవ్యస్తంగా వదిలేయడంతో పోలింగ్ బూత్‌లలో పార్టీ ఏజెంట్లయినా కూర్చుంటారా అనే సందేహం జాతీ య నాయకత్వంలో వ్యక్తమైనట్లు తెలిసింది.
పార్టీ విజయం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు దిశానిర్దేశమే కరువైందని.. పైగా నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని నడ్డా ఆక్షేపించినట్లు స మాచారం. పార్టీ అభ్యర్థి సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్టీలో ఎవరెవరున్నారు.. వారిని ఎక్కడెక్కడ మోహరించాలి.. బీజేపీని అభిమానించే వర్గాలను ఎలా కాపాడుకోవా లి.. ఇతర పార్టీల్లో ఉన్న అసంతుష్ట నేతలెవరు.. వారిని మనవైపు ఎలా తిప్పుకోవాలి.. ఇలాంటి విషయాలేవీ పట్టించుకోకుండా.. పారిశ్రామికవేత్తలెవరు.. కాంట్రాక్టర్లు ఎవరు.. వారి నుంచి ఎంత వసూలు చేయాలన్నదానిపైనే రాష్ట్ర నేతలు దృష్టి సారించినట్లు నడ్డాకు పక్కా సమాచారం అందింది. తిరుపతి అభ్యర్థి రత్నప్రభ సామాజిక వర్గానికి చెందిన ఒక మాజీ మంత్రి గత టీడీపీ ప్రభుత్వంలో వందల కోట్ల రుణా లు దళితులకు ఇప్పించారు. అప్పట్లో బీజేపీ కూడా ఆ సర్కారులో భాగస్వామి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన్ను రంగంలోకి దించాల్సిన నాయకులు గ్రూపు రాజకీయాలతో పక్కన బెట్టారు. రత్నప్రభ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆమెకు తోడుగా మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకురాలిని ఉంచితే జనం ఆకర్షితులవుతారని బీజేపీలోని ఓ వర్గం నేత లు అంటున్నారు.
టీడీపీలో ఉండగా ఫైర్ బ్రాండ్‌గా పేరు తె చ్చుకున్న యామినీ సాధినేని తిరుపతిలో ఎక్కడా కనిపించలే దు. బీజేపీకి ఎక్కువ ఓట్లు పడే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆమె.. ఆ వర్గీయులు ఉన్న ప్రాంతాల్లో పర్యటించినా కొంతమేర ఫలితం ఉంటుందని.. అంతేగాక తిరుపతి అభ్యర్థి తల్లి కూడా అదే సామాజిక వర్గం కావడంతో మరింత ప్రభా వం చూపొచ్చని.. కానీ రాష్ట్ర నాయకులు తమను డామినేట్ చేసే గొంతును ఎక్కడా వినిపించనివ్వరని ఆ వర్గాలు బహిరంగంగానే ఆక్షేపిస్తున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన సినీ నటిని రాష్ట్ర నాయకుడు తీసుకొచ్చినా ఆమె పవన్ కల్యాణ్‌ను పొగడడం.. సలహా ఇచ్చిన నేతలపై కోప్పడడం లాంటి చర్యలతో మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ ఇద్దరే చెప్పారా?
రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఒక బడా కాంట్రాక్టరు ను, ప్రతిపక్ష టీడీపీకి చెందిన పారిశ్రామికవేత్తను బీజేపీ నేత లు ఎన్నికల ఖర్చులకు డబ్బులు అడిగినట్లు అంతర్గతంగా చ ర్చ జరుగుతోంది. రెండు పార్టీల్లోనూ కీలక ప్రజాప్రతినిధులైన ఆ ఇద్దరి నుంచి కోట్ల రూపాయలు అడగడంతో.. తానెందుకు ఇవ్వాలని పారిశ్రామికవేత్త ఎదురు ప్రశ్నించారు. అయినా పదే పదే అడగడంతో ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు ఆయన చెప్పినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన బడా కాంట్రాక్టరు కు సైతం బీజేపీ రాష్ట్ర నేతలు ఫోన్లు చేసినట్లు తెలిసింది. ఆయన తండ్రే తిరుపతి వైసీపీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నారు. అయినా పదే పదే ఫోన్లు చేసి ఫండ్ అడిగినట్లు తెలిసింది.
ఈ వ్యవహారం ఈ ఇద్దరి వల్లే ఢిల్లీ నేతలకు తెలిసి ఉంటుందని రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు మధనపడుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలిచేది తామేనంటూ కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు పైకి చెబుతున్నా.. లోపల మాత్రం కనీసం పది శాతం ఓట్లు సాధిస్తేనే తమ పదవులు నిలుస్తాయని.. లేదంటే సాగనంపుతారని లోలోపల భయపడుతున్నారు. అయితే..ఒక్క ఎన్నికలో కూడా గెలవని, కనీసం డిపాజిట్లు తెచ్చుకోని నేతలు అక్కడ కీలకంగా వ్యవహరిస్తుండడంతో పది శాతం కూడా కష్టమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Updated Date - 2021-04-14T09:15:03+05:30 IST