15వేల ఉద్యోగాలే ఇచ్చారు: లోకేష్
ABN, First Publish Date - 2021-07-15T18:43:16+05:30
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 15వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని లోకేష్ అన్నారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 15వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మానందం డైలాగ్‌ను చెప్పారు. ‘ఓ సినిమాలో బ్రహ్మానందం రూపాయి ఇచ్చి పండగ చేస్కో’అంటారు. ఇప్పుడు ఏపీలో కూడా పరిస్థితి అలాగే ఉందన్నారు. 2 లక్షల 30వేల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం 15 వేలు ఉద్యోగాలు ఇచ్చి పండుగ చేస్కోమంటోందని, వాళ్ల నాయకులు సీఎంకు పాలాభిషేకం చేస్తారని ఎద్దేవా చేశారు. ఇచ్చే 36 గ్రూప్1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ఆయనకు పాలాభిషేకం చేయాలా? అని ప్రశ్నించారు.
గ్రూప్1, గ్రూప్ 2కు సంబంధించి 2018లో చంద్రబాబు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఈ ప్రభుత్వం ఇప్పటికీ భర్తీ చేయలేకపోయిందని లోకేష్ విమర్శించారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఇవాళ ఏపీపీఎస్సీ రాజకీయ వేదికగా మారిందని ఆరోపించారు. అర్హులు బయట ఉన్నారని, డబ్బులు ఖర్చుపెట్టినవారు లోపల ఉన్నారన్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-07-15T18:43:16+05:30 IST