ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దారుణం

ABN, First Publish Date - 2021-03-23T04:55:59+05:30

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దారుణమైన చర్య అని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మాట్లాడుతున్న చంద్రశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీపై నమ్మకం 

ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి


నెల్లూరు(వెంకటేశ్వరపురం), మార్చి 22 : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ  దారుణమైన చర్య అని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయన్నారు. ఉద్యోగులకు పీఆర్సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో కలిపి ఇస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పటికే ఐఆర్‌ 27శాతం ఇస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సీసీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శేఖర్‌రావు, కార్యదర్శి ఆంజనేయవర్మ పలువురు జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-23T04:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising