ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుబంధాల మేలుకలయిక

ABN, First Publish Date - 2021-01-14T03:56:35+05:30

ఆచార, సంప్రదాయాల నుంచి ఉద్భవించినవే పండుగలు.

నెల్లూరులో భోగి మంగలు వేస్తున్న నగర వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి

రేపు పశువుల పండుగ కనుమ

‘‘ఏం మావా బాగున్నావా..!? 

ఏరా సుబ్బిగా ఎలా ఉన్నావ్‌!?. 

రత్తయ్య ఇంకా రాలేదా!?  యాడున్నాడట!?

ఇంతకీ నువ్వాడున్నావ్‌!?  ఏం చేస్తున్నావ్‌!? ఏమన్నా వెనకేసుకున్నావా!? పండుగ మందలేంటి!?. మాయదారి కరోనాతో ఏమైనా ఇబ్బందిపడ్డావా!?’’ 

గ్రామాల్లో ఎటు చూసినా ఇలా కుశల ప్రశ్నలే వినిపిస్తున్నాయి. మొన్నటివరకు బోసిపోయిన పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. పెద్దల పలకరింపులు.. నారీమణుల వంటకాలు.. పిల్లల కేరింతలతో అంతటా సందడి నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. బుధవారం వేకువజామున నగరం, పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ప్రధాన కూడళ్లలో యువత భోగి మంటలు వేసింది. 

 

ఆత్మకూరు/నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 13 : ఆచార, సంప్రదాయాల నుంచి ఉద్భవించినవే పండుగలు. ప్రకృతి శక్తులను పూజించే చర్యల్లో భాగంగా ఆచరించే పండుగల్లో మకర సంక్రాంతిది మొదటి స్థానం. వ్యవసాయ ఆధారిత సమాజంలో ఆరుగాలం శ్రమించే అన్నదాత ఇంటికి ధనధాన్యాలు తరలివచ్చే కాలమిది. ఈ క్రమంలో రైతన్నలు ఆ ఆనందాన్ని పిల్లాపాపలు, కుటుంబసభ్యులు, బంధుగణంతో కలిసి ఉత్సాహంతో జరుపుకొనే పెద్దపండుగ. ఓ విధంగా చెప్పాలంటే అనుబంధాల మేలు కలయిక సంక్రాంతి. ‘సం’ అంటే మిక్కిలి అని, ’క్రాంతి’ అంటే అభ్యుదయం అని అర్థం స్ఫూరిస్తుంది. సంక్రాంతి అంటే చైతన్యం అని కూడా చెబుతారు. బుధవారం భోగితో ప్రారంభమై శుక్రవారం కనుమతో ముగుస్తుంది. గురువారం సంక్రాంతిని పెద్దపండుగగా జిల్లావాసులు జరుపుకోనున్నారు. పెద్దపండుగ నాడు ప్రతి ఇంటా ఉపవాసాలు ఉండి పూజల అనంతరం తమతరం కుటుంబసభ్యులను స్మరించుకుంటూ వారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. 


జిల్లావ్యాప్తంగా పండుగ శోభ

సంస్కృతి, సంప్రదాయబద్ధంగా మకర సంక్రాంతి జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. బంధు మిత్రులతో పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినందున మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆచారం ఉంది. ఆలయాలకు పూలు, మంగళతోరణాలతో అలంకరించారు. మూలవర్లకు ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి  ప్రతి భక్తుడు మాస్కులు ధరించి రావాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక సమాధుల వద్ద పెద్దలకు తర్పణ లు, పూజలు చేస్తారు. ఇందుకోసం విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను స్థానిక అధికారులు సమకూర్చారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బోడిగాడితోట సమాధుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించారు. కమిషనర్‌ దినే్‌షకుమార్‌ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. నెల్లూరులో ఆంధ్రప్రదేశ్‌ కైట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మూలాపేట, నెక్లెస్‌ రోడ్డులో గాలిపటాలు పండుగను నిర్వహిస్తున్నారు. 


రేపు కనుమ

మూడు రోజుల పండుగలో చివరి రోజు పండుగ కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో తమకు తోడునీడగా నిలిచిన పశువులను ప్రత్యేకంగా పూజించే ఆచారం ఉంది. అదే కనుమ పండుగగా జరుపుకుంటాం. కనుమ రోజుల పశువు చావిడిని చక్కగా శుభ్రం చేసి అలంకరిస్తారు. తమ వద్ద ఉండే ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నపోతులకు స్నానం చేయించి శరీరంపై పసుపు రాసి  కుంకుమ బొట్టు పెట్టి భక్తితో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మినుప గారెలు వండి పశువులకు తినిపిస్తారు. పాలు, కొత్తబియ్యంతో పొంగళి వండుతారు. కొన్ని ప్రాంతాల్లో కనుమ పండుగ రోజు మినుములు తినాలనే ఆచారం ఉంది. అందుకే మినపగారెలు వండుకుని తినడం ఆనవాయితీగా వచ్చింది. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్లిన అల్లుళ్లు కూడా కనుమ రోజున తిరుగు ప్రయాణం చేయరు. ఈ పండుగ రోజు మాంసాహారంలోని విభిన్నరుచులను వండుకుని ప్రియంగా భోంచేస్తారు.  



Updated Date - 2021-01-14T03:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising