ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంగా జగన్‌ మూడేళ్లు కొనసాగలేడు

ABN, First Publish Date - 2021-03-10T02:43:09+05:30

ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లు కూడా కొనసాగలేడని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. స్థానిక లయోలా క

మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- చింతా మోహన్‌

గూడూరు, మార్చి 9: ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లు కూడా కొనసాగలేడని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. స్థానిక లయోలా కళాశాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. దుగరాజపట్నంపోర్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చి 2012లోనే నిధులను కేటాయించిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు అసమర్థత, బంధుప్రీతి కారణంగా ఈ ప్రాజెక్టు నీరుకారిందన్నారు. వైసీపీ దౌర్జన్యాలపార్టీగా మారిందన్నారు.  పంచాయతీ ఎన్నికలలో పోలీసు అధికారులను అడ్డంపె ట్టుకుని వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. తిరుపతి పార్లమెంటు అఽభివృద్ధిపై వైసీపీ, టీడీపీ, బీజేపీ ఏం చేశాయో కాంగ్రెస్‌పార్టీతో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సీఎంకు తెలిసే జరిగిందన్నారు. జగన్‌లాంటి బలహీనమైన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏపీకి ఎవరూ లేరని మరో వందేళ్లలో కూడా రాబోరన్నారు. కార్యక్రమంలో పంటా శ్రీనివాసులురెడ్డి, పూల చంద్రశేఖర్‌, వేమయ్య, నాగభూషణం, శ్రీహరి, సల్మాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-10T02:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising