ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2021-11-10T04:22:23+05:30

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి పేర్కొన్నారు.

ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ సివిల్‌ జడ్జి పాండురంగారెడ్డి 

కావలి, నవంబరు 9: చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి పేర్కొన్నారు. న్యాయదినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పోలీసులు తదితరులు కావలిలో ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి ట్రంకు రోడ్డు మీదుగా ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌ వరకు ర్యాలీ కొనసాగించారు. ప్రజలకు సత్వర న్యాయం అందే విధానం, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ వై.పరుశురాం, ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసులు, కావలి బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కాటా సురేంద్రరెడ్డి, జనరల్‌ సెక్రటరీ ఆర్‌ నాగేంద్రబాబు, జాయింట్‌ సెక్రటరీ బాలాజీ, సీనియర్‌ న్యాయవాదులు పోట్లూరి శ్రీనివాసులు, ఏ.ప్రసాద్‌రెడ్డి, ఖలీమ్‌ రోజ్‌దార్‌, కెన్నడీ, సునీల్‌బాబు, పూర్ణచంద్రరావు, కామేశ్వరరావు, రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-10T04:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising