ఉచిత వైద్యశిబిరం
ABN, First Publish Date - 2021-12-20T03:23:20+05:30
స్థానిక శారదనగర్ గిరిజన కాలనీలో ఆదివారం సిద్దు అలర్జీ, ఊపిరితిత్తుల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
గూడూరు, డిసెంబరు 19: స్థానిక శారదనగర్ గిరిజన కాలనీలో ఆదివారం సిద్దు అలర్జీ, ఊపిరితిత్తుల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. హాస్పిటల్ డాక్టర్ హరిప్రసాద్ వైద్యపరీక్షలు నిర్వహించి మందులు, మాస్కులను పంపిణీ చేశారు. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది గౌస్‌బాషా, అనిల్, ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-20T03:23:20+05:30 IST