ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణముఖినదిలో మునిగి వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2021-12-27T04:36:42+05:30

స్వర్ణముఖినదిలో ఓ వృద్ధుడు శనివారం సాయం త్రం ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందాడు.

స్వర్ణముఖినదిలో మృతదేహాన్ని వెలికి తీస్తున్న కుటుంబసభ్యులు, మృతుడు రంగయ్య (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లకూరు, డిసెంబరు 26 : స్వర్ణముఖినదిలో ఓ వృద్ధుడు శనివారం సాయం త్రం ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు చిల్లకూరు గ్రామానికి చెందిన పుల్లా రంగయ్య (57) స్వర్ణముఖినది అవతల ఉన్న తన పొలంలోకి వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. నదిని దాటుతూ తెలియక లోతుగా ఉన్న చోట దిగడంతో మునిగిపోయాడు. సాయంత్రానికి రంగయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వివాహమైన కుమార్తెలకు, బంధువులకు సమాచారం అందించారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి సమాచారంతో కుటుంబసభ్యులు నదిలో గాలించగా  కప్పగుంటకండ్రిగ బ్రిడ్జి సమీపంలో శవమై కన్పించాడు. మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ అహ్మద్‌బాషా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య మస్తానమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2021-12-27T04:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising