ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా సీతారామ కల్యాణం

ABN, First Publish Date - 2021-04-22T02:45:33+05:30

స్థానిక బాలాంజనేయస్వామి ఆలయంలో బుధవారం సీతారామ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవర

సూళ్లూరుపేట బాలాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన సీతారామ కల్యాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 21:  స్థానిక బాలాంజనేయస్వామి ఆలయంలో బుధవారం సీతారామ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి, మంత్రోచ్ఛరణాల మధ్య కల్యాణాన్ని జరిపించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ మాస్క్‌లు ధరించి కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు దీవి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కల్యాణానికి ముత్యాల తలంబ్రాలను కందుకూరి భాస్కర్‌ ఆచారి సమర్పించారు. అయితా శ్రీధర్‌, కాకి శ్రీరామమూర్తి, మతుకూరు భాస్కర్‌రావు, ఎస్‌ వెంకటసుబ్బయ్య, కర్లపూడి రాజగోపాల్‌రావు, పోలూరు రాధాకృష్ణయ్య, పోలూరు శ్రీధర్‌, ఎన్‌. రాజేంద్రప్రసాద్‌, కె. భగవాన్‌దాస్‌లు ఉత్సవ సహాయకులుగా వ్యవహరించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం తరపున సీతారాములకు కల్యాణ వస్త్రాలు సమర్పించారు. తిరుమాంగల్యాన్ని వాకిచర్ల రాజగోపాల్‌శెట్టి జ్ఞాపకార్థం శాంతారావు సమర్పించారు.



నాయుడుపేటలో..


నాయుడుపేట టౌన్‌, ఏప్రిల్‌ 21 :  పట్టణంలోని సంజయ్‌ గాంఽధీ కాలనీ వద్ద ఉన్న కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. స్వామివార్లను ప్రత్యేక పుష్పాలతో అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం నిర్వహించారు. పట్టణంలోని రాజగోపాలపురంలో వెలసి ఉన్న లక్ష్మణ సమేత సీతారామాంజనేయ ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా కృష్ణారెడ్డి, పావని దంపతు లు వ్యవహరించారు. కార్యక్రమంలో శేషం మునిగోపీ, అంకయ్య, జనార్దన్‌యాదవ్‌, శేషం మునిమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 




ఓజిలిలో...


ఓజిలి, ఏఫ్రిల్‌ 21 : మండలంలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆరిమేనిపాడు, రాచపాళెం, కురుగొండ, ఓజిలి, సగుటూరు, అత్తివరం, వజ్జావారిపాళెం, చిల్లమానుచేను త దితర గ్రామాలలోని ఆలయాలలో ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.


-----------------








Updated Date - 2021-04-22T02:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising