ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదవులకు 30 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు కేటాయించాలి

ABN, First Publish Date - 2021-12-26T03:07:14+05:30

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు యాదవులకు 30 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు చొప్పున కేటాయించాలని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గురవయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న గురవయ్య యాదవ్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గురవయ్య యాదవ్‌

కావలి, డిసెంబరు 25: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు యాదవులకు 30 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు చొప్పున కేటాయించాలని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గురవయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. కావలి జర్నలి్‌స్టక్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 1.15 కోట్లకు పైగా ఉన్న యాదవులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్‌, తదితర పదవుల్లో ఉన్న వారు యాదవులు. కొందరు తాను పుట్టిన కులాన్నే మరచి యాదవులపైనే అనుచిత వాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. యాదవుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో చర్చించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరుతూ లేఖ పంపితే ఆయన ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఈ సమావేశంలో తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు కొల్లు మధుబాబు యాదవ్‌, జిల్లా యూత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిమటా కిషోర్‌ యాదవ్‌, కావలి యూత్‌ అధ్యక్షుడు చెనికల సాయిబ్రహ్మ, కార్యదర్శి వెంకట నరసింహారావు, ఉదయగిరి నియోజకవర్గ యూత్‌ ప్రెసిడెంట్‌ గోళ్ల వెంకటప్రతాప్‌ యాదవ్‌, దత్తాత్రేయ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T03:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising