ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ స్థలం అక్రమించారంటూ నిరసన

ABN, First Publish Date - 2021-04-13T03:42:29+05:30

మండలంలోని తోటలచెరువుపల్లిలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయ స్థలాన్ని కొంతమంది అక్రమించుకొంటున్నారంటూ సోమవారం గ్రామస్థులు మండల పరిషత్‌, తహసీల్దారు కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, ఏప్రిల్‌ 14: మండలంలోని తోటలచెరువుపల్లిలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయ స్థలాన్ని కొంతమంది అక్రమించుకొంటున్నారంటూ సోమవారం గ్రామస్థులు మండల పరిషత్‌, తహసీల్దారు కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో పురాతన ఆలయం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆధునికీకరించి నూతనంగా పునఃనిర్మాణం చేపట్టేందుకు గ్రామస్థులు పూనుకొన్నారు. దీంతో ఇటీవల కాలంలో ఆలయ స్థలాన్ని అక్రమించిన కొంతమందిని స్థలాన్ని ఖాళీ చేసి నిర్మాణాన్ని సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో కొంతమంది అక్రమ కట్టడందారులు తొలగించినప్పటికీ, మరికొంతమంది ససేమిరా అంటూ నూతన కట్టడాలకు సైతం పూనుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని వాపోయారు. గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఏళ్ల తరబడి గుడి నిర్మాణం వాయిదా పడుతూనే ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఆలయ స్థలాన్ని అక్రమించి నిర్మించుకున్న అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీడీవో సురే్‌షబాబు, తహసీల్దారు, పోలీ్‌సస్టేషన్లలో వినతిపత్రాలు అందజేయడంతోపాటు గ్రామంలోని ఆలయం స్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు.



Updated Date - 2021-04-13T03:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising