ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యాత్మక గ్రామాలపై దృష్టి

ABN, First Publish Date - 2021-02-06T04:42:38+05:30

పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు జిల్లా ఆడిషనల్‌ ఎస్పీ వెంకటరత్నం పేర్కొన్నారు.

వరికుంటపాడు: గణేశ్వరాపురంలో అవగాహన కల్పిస్తున్న ఏఎస్పీ వెంకటరత్నం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆడిషనల్‌ ఎస్పీ వెంకటరత్నం

వరికుంటపాడు/ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 4: పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు జిల్లా ఆడిషనల్‌ ఎస్పీ వెంకటరత్నం పేర్కొన్నారు. శుక్రవారం ఆమె వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లోని గణేశ్వరాపురం, తిమ్మారెడ్డిపల్లి, తూర్పుకొండారెడ్డిపల్లి, దుత్తలూరు, నర్రవాడ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె వెంట కావలి డీఎస్పీ ప్రసాద్‌, ఉదయగిరి సీఐ ప్రభాకర్‌రావు, ఎస్‌ఐలు ఉమాశంకర్‌, జంపాని కుమార్‌, సిబ్బంది ఉన్నారు. 

కొండాపురం : పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ పీ.వెంకటరత్నం అన్నారు. మండలంలోని గరిమెనపెంట గ్రామ పోలింగ్‌ స్టేషన్‌ను ఆమె పరిశీలించారు. ఓటర్లను డబ్బు. మద్యం వంటి ప్రలోభాలకు గురిచేస్తే అభ్యర్ధులపై చట్టపరమయిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట డీఎస్పీ ప్రసాద్‌, కలిగిరి సీఐ శ్రీనివాసులు, ఎస్సై పీ.రవిబాబు ఉన్నారు.

కలిగిరి : పంచాయతీ ఎన్నికలు సుజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా అడిషనల్‌ ఎస్పీ వెంకటరత్నం పేర్కొన్నారు. మండలంలోని అనంతపురం, కావలిముస్తాపురం గ్రామాల్లోని పోలింగ్‌ బూత్‌లను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వీరేంద్ర బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising