ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పుడే ఇలా.. భవిష్యత్తు ఎలా!?

ABN, First Publish Date - 2021-05-08T04:39:29+05:30

కరోనా.. కరోనా.. కరోనా... మాత్రల మొదలు ఆక్సిజన్‌ మాస్కుల వరకు అన్నీ అధిక ధరలే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండుతున్న నిత్యావసరాల ఽధరలు

కాయగూరలూ అంతే!

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

సామాన్యుడు విలవిల


నెల్లూరు, మే 7 (ఆంధ్రజ్యోతి): కరోనా.. కరోనా.. కరోనా... మాత్రల మొదలు ఆక్సిజన్‌ మాస్కుల వరకు అన్నీ అధిక ధరలే. నిర్ధారణ పరీక్ష నుంచి ఆసుపత్రిలో పడకల వరకు రెండింతల ధరలు వెచ్చించాల్సిందే. ఇప్పుడు నిత్యావసరాలు తోడయ్యాయి. అన్ని కార్యాకపాలాలకు మధ్యాహ్నం 12 గంటల వరకే కాలపరిమితి విధించడంతో ఈ కారణం చూపి మార్కెట్‌లో మెల్లమెల్లగా సరుకుల ధరలు పెరగడం మొదలయ్యాయి. ఇప్పటివరకు హోల్‌సేల్‌ ధరల్లో మార్పు లేదు కానీ రీటైల్‌ ధరలు మాత్రం పెరగడం మొదలు పెట్టాయి. ఈ ధరల కట్టడికి ఇప్పడే చర్యలు మొదలు పెట్టకపోతే, నిత్యావసరాల ధరలపై నిత్య సమీక్ష జరగకపోతే రోజుల వ్యవధిలోనే ఇవి ఆకాశాన్ని అంటే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతానికి వైద్యానికి అల్లాడుతున్న జనం భవిస్యత్తులో నిత్యావసర సరుకులు కొనలేక జనం అల్లాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. 


అన్నింటా పెరిగాయ్‌!


నెల్లూరు నగరంలో రీటైల్‌ షాపుల్లో సరుకుల ధరలు  కర్ఫ్యూకు ముందు ఇప్పటికి గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు చింతపండు కిలో మొదట్లో రూ.150 ఉండగా ఇప్పుడు రూ.180. కందిపప్పు కిలో మీద ఎనిమిది రూపాయలు పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు రూ.112 ఉండగా, ఇప్పుడు రూ.120కి ఎగబాకింది. పెసరపప్పు 115 నుంచి 125, మినపప్పు 115 నుంచి 125, వంట నూనె లీటరు 170 నుంచి 180, ఎండుమిర్చి రూ.160 నుంచి 180లకు పెరిగింది. కర్ఫ్యూ మొదలైన మూడు రోజుల్లోనే రిటైల్‌ షాపుల్లో ధరలు కిలో మీద పది రూపాయలు పెరిగిపోయింది. కూరగాయల పరిస్థితి కూడా ఇంతే. ఉల్లిపాయలు మినహా మిగిలిన అన్ని కాయగూరల ధరలు పెరిగిపోయాయి. మొన్నటి వరకు గరిష్ఠంగా కిలో 40 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 60లకు పెరిగాయి. ఒకటి రెండు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే సరుకుల  వాహనాలకు కర్ఫ్యూ ఆంక్షలు ఎదురవుతుండటంతో దిగుమతి తగ్గుతోందని ఆ ప్రభావం ధరలపై పడుతున్నట్లు చెబుతున్నారు.


పర్యవేక్షణ అవసరం


పాక్షిక లాక్‌డౌన్‌ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆంక్షలు పెరిగే కొద్ది డిమాండ్‌ పెరిగి సరుకుల ధరలు పెరగుతాయనడంలో అనుమానం లేదు. ఈ విషయంలో అధికారులు ఇప్పటి నుంచే చర్యలు మొదలు పెట్టాలి. గత ఏడాది కరోనా తొలి విడతలో లాక్‌ డౌన్‌లో నిత్యావసరాల ధరలు పెరగకుండా కట్టడి చేయడానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా కృషి చేసింది. ఽజిల్లా అదికారులతో మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ప్రతి రోజు మానిటరింగ్‌ కమిటీతో సమావేశమై ధరల విషయాన్ని సమీక్షించారు. ప్రతి షాపు వద్ద ధరల పట్టిక పెట్టించారు. అధిక ధరలకు అమ్మితే పిర్యాదు చేయడానికి టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్‌కు ఒక కూరగాయల షాపు ఏర్పాటు చేశారు. కూరగాయల ధరలు అధికారులే నిర్ణయించి ఆ రేటుకు విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పట్లో ఆ స్థాయిలో చర్యలు చేపట్టకపోయినా ఽనిత్యావసర సరుకుల ధరలపై అధికారుల నిఘా ఉంది అనే విషయం వ్యాపారులు గుర్తించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ధరల నియంత్రణ, పర్యవేక్షణ కోసం అధికారుల బృందంతో ఒక కమిటీ వేయాల్సి ఉంది. తరచూ ధరలపై సమీక్షించాల్సి ఉంది. లేని పక్షంలో అధికారులు మేలుకొనే లోపలే సగటు మనిషి నష్టపోయే ప్రమాదం ఉంది. 

Updated Date - 2021-05-08T04:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising