ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరనిందలేల సజ్జలా..?

ABN, First Publish Date - 2021-12-31T07:25:48+05:30

పరనిందలేల సజ్జలా..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వయంకృతాపరాధాలను వైసీపీ గుర్తించాలి 

మాట తప్పారు.. మడం తిప్పారు: సీపీఐ రామకృష్ణ


అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని విషయంలో వైసీపీ చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇతర పార్టీలపై నిందలు వేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాజధాని అంశాన్ని వైసీపీ అవకాశవాదంగా మార్చుకుందని  గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘అమరావతి రాజధానిగా ఉండడం సరైన నిర్ణయమని వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట వాస్తవమా? కాదా? మాట తప్పం.. మడం తిప్పం.. అన్న జగన్‌ అమరావతి విషయంలో మాట మార్చి.. మడం తిప్పారా? లేదా?’ అని ప్రశ్నించారు. వైసీపీ గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, ఇప్పుడు ఇతరులపై నిందలేయడం తగునా అని నిలదీశారు. పరనిందలు వేసే ముందు స్వయంకృతాపరాధాలను వైసీపీ గుర్తించాలని సూచించారు. ‘మీరు చేసే మోసాన్ని సమర్థిస్తేనే మంచివాళ్లు. లేకుంటే చెడ్డ వాళ్లవుతారా? ప్రభుత్వ సలహదారుగా ఉన్న మీరు విజ్ఞత మరచి మాట్లాడడం సరికాదు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా వైసీపీ వైఖరి ఉంది’ అని ఎద్దేశా చేశారు. 

Updated Date - 2021-12-31T07:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising