ఏపీలో రోడ్ల పరిస్ధితి అధ్వానం: పట్టాభి
ABN, First Publish Date - 2021-12-19T18:43:06+05:30
ఏపీలో రోడ్ల పరిస్ధితి అధ్వానంగా మారిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు.
విశాఖపట్నం: ఏపీలో రోడ్ల పరిస్ధితి అధ్వానంగా మారిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఆదివారం విశాఖలో పట్టాభి పర్యిటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండున్నరేళ్లలో ఏపీలో ఒక్క కిలో మీటరు రహాదారి కూడా వేయని దుస్ధితి ఉందన్నారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు వేయడానికే కాంట్రాక్టర్లు వెనకాడుతున్నారని చెప్పారు.కాంట్రాక్టర్లు ఎందుకు కోర్టుకు వెళ్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 420 ప్రభుత్వాన్ని చూసి బ్యాంకులు సైతం భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. రోడ్డు ప్రాజెక్టులను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. అమరావతి గుంటూరు తెనాలి చుట్టూ ఓఆర్ఆర్ నిర్మించుకోవాల్సిన అవరాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు జగన్ సర్కారు ఉరివేస్తోందన్నారు.
ఓఆర్ఆర్ పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని నితిన్ గడ్కరీ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.189 కిమీ ప్రాజెక్టుకు గానూ కేంద్రం సిద్ధంగా ఉన్నా 78 కిమీ బైపాస్ రోడ్డు ఇస్తే చాలని వైసీపీ చెప్పడం విడ్డూరంగా ఉందని దెప్పిపోడిచారు.ఓఆర్ఆర్‌కు ఎందుకు మంగళం పాడాలనుకుంటున్నారన్నారు. 17, 767 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఆర్వీ అసోసియేట్స్ డిజైన్ చేశారని చెప్పారు. ఓఆర్ఆర్ వస్తే 4లక్షల ఎకరాల భూమి వినియోగంలోకి వస్తుందన్నారు. బ్లాక్ టికెట్ల మంత్రి పేర్నినానికి ఓఆర్ఆర్‌కు బైపాస్ రోడ్‌కి తేడా తెలుసా అని ప్రశ్నించారు. జూలై 2019లోనే డీపీఆర్ ఇనీషేయేట్ చేస్తే కేంద్రం చెత్తబుట్టలో వేసిందని చెపుతారా అని అన్నారు. మార్చి 5 2020 లోనే ఫీజుబిలిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకు తీసుకుకెళ్తామని కేంద్రం చెప్పిందన్నారు. భూసేకరణ చేయండని అడిగితే కేంద్రం చెపితే నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా తప్పుపడతారా అని మండిపడ్డారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు వల్లే హైదరాబాద్ దశమారిందని పట్టాభి తెలిపారు.
Updated Date - 2021-12-19T18:43:06+05:30 IST