రేపటి సభకు పవన్ హాజరుపై అనుమానాలు?
ABN, First Publish Date - 2021-04-11T21:15:02+05:30
ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడంపై అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం లేదని
ఇంటర్నెట్ డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో చాలామంది కరోనా బారిన పడడంతో వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్త చర్యగా పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే రేపు(సోమవారం) బీజేపీ-జనసేన సంయుక్తంగా విజయ యాత్రను ప్రారంభించనున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేనాధిపతి పవన్ కల్యాణ్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ హాజరు కాబోతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
కానీ, ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడంపై అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం లేదని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 14 రోజుల క్వారంటైన్ పూర్తి అయ్యాకే పవన్ కల్యాణ్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ-జనసేన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే పవన్ కల్యాణ్‌కు ఉంది. అయితే ఆయన ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారో లేదో చూడాలి.
Updated Date - 2021-04-11T21:15:02+05:30 IST