ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహితను వేధిస్తున్న యువకుడి అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-12-25T05:51:14+05:30

వివాహితను వేధిస్తున్న యువకుడిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైన ఘటన శుక్రవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాన్‌ బెయిల్‌బుల్‌ కేసు నమోదు.. 14 రోజుల రిమాండ్‌

పోలీసు స్టేషన్ల ఎదుట బాధితురాలి నిరసన


కనిగిరి, డిసెంబరు 24 : వివాహితను వేధిస్తున్న యువకుడిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైన ఘటన శుక్రవారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మండల పరిధిలోని తాళ్లూరు గ్రామానికి చెందిన చలివేంద్రం ఏడుకొండలు అదే పంచాయతీ పరిధిలోని గుండ్లపాలెం గ్రామానికి చెందిన బాధితురాలిని ఫోన్‌లో వేధిస్తున్నాడు. 

ఆ మేరకు స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఏడుకొండలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ జి.రామిరెడ్డి తెలిపారు. 

ప్రజా సంఘాలతో బాధిత మహిళ ఆందోళన

ఏడుకొండలు తనను చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడని గత నెలలోనే పలుమార్లు బాఽధిత మహిళ, ఆమె తల్లిదండ్రులతో కలిసి కనిగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా ఏడుకొండలుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ నెల 17న బా ధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుకొండలుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తనకు న్యాయం జరగదని భావించిన బాధితురాలు ప్రజాసంఘాలు, కుల సంఘాల ను ఆశ్రయించింది. సంఘాలతో కలిసి పోలీసు స్టేషన్‌ఎదుట ఆందోళ న నిర్వహించారు. సీఐ పాపారావు బాధితులను విచారించారు. తనను వేధిస్తున్న ఏడుకొండలుపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని బాధిత మహిళ వేడుకొంది. ఏడుకొండలను అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2021-12-25T05:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising