ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తున్న మోడీ

ABN, First Publish Date - 2021-03-22T06:40:47+05:30

ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరిచి కార్పోరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న వై వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం నేత వెంకటేశ్వరరావు (వై.వీ) విమర్శ

కనిగిరి, మార్చి 21: ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరిచి కార్పోరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు విమర్శించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం సూరసాని లక్ష్మిరెడ్డి ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఫలితంగా రైతులకు నష్టం జరిగి కార్పోరేట్‌ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా నష్టపరుస్తూ కేంద్రం మొండిచేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో చలనం  లేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం విస్మరించిందని అయినా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కేంద్రం ఆమోదించిన నల్ల చట్టాలను బలపరచడం దుర్మార్గమన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న చేపట్టే భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. తొలుత సూరసాని లక్ష్మిరెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి పాల్గొని లక్ష్మిరెడ్డి అభ్యుదయ భావాలతో సిపిఎం పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని, నిజాయితీగా, నిస్పక్షపాతంగా పనిచేసి మంచి అధికారిగా అందరి మన్ననలు అందుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హనీఫ్‌, పిసి కేశవరావు, పిల్లి తిప్పారెడ్డి, జి వెంకటరామిరెడ్డి, వై ఆంజనేయులు, పివి శేషయ్య, పిసి కేశవరావు, ఆవులయ్య, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా రాజ్యలక్ష్మి, కె మాల్యాద్రి, వి మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T06:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising